• No categories
  • No categories

పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి

యూరియా యాప్ ను వెంటనే తొలగించి రైతులకు నేరుగా యురియాను సరఫరా చేయాలి .

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముగాస్తు రైతులను మోసం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని,అలాగే యూరియా యాప్ ను తీసివేసి రైతులకు నేరుగా యూరియా ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గరిడేపల్లి మండల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం తహసిల్దార్ స్రవంతికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా, ఎరువుల ధరలను తమకు ఇష్టం వచ్చిన రీతిగా ప్రతి సంవత్సరం పెంచుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని, రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము నష్టపోతు వ్యవసాయం చేస్తున్నారని ఆయన అన్నారు.

పెట్టుబడిదారులకు అంబానీ ఆదానీ
ల లాంటి బిల్లియనీర్లకు వేల కోట్ల రూపాయల సబ్సిడీలను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఇస్తున్న ఏరువుల ధరను ప్రతి సంవత్సరం కొంత సబ్సిడీ ఎత్తివేస్తూ,ధరలను పెంచడం ఏమాత్రం బావ్యంకాదని ఆయన అన్నారు.

గతంలో యురియా కావాల్సి వచ్చినప్పుడు రైతులు ఎరువుల షాపుల వద్దకు వెళ్లి  తెచ్చుకుని
తమ పంట పొలాలకు వేసుకునే వారిని నేడు ఆ పరిస్థితి లేదని యాప్ లను ప్రవేశపెట్టి యాప్ ల ద్వారా యూరియాను సరఫరా చేయటం వలన రైతులకు ఆ టెక్నాలజీ తెలియక యూరియా తెచ్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే  యూరియా యాప్ ను తీసేసి గతంలో మాదిరిగా యురియాను రైతులకు నేరుగా ఇవ్వాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య,త్రిపురం సుధాకర్ రెడ్డి, యడ్ల అంజిరెడ్డి, ప్రతాని సైదులు,హుసేన్, రాచమళ్ళ వెంకన్న,జొన్నగడ్డ తిరపయ్య, ఈద ఆంజనేయులు,ఈద పవన్ తోకల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు

Continue reading

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..
  
  ఈరోజు పానుగల్ మండలంలోని  దావత్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన రాజు ఆహ్వానం మేరకు వారి కుమారుడు సహర్షిచంద్ర మొదటి జన్మదిన వేడుకల్లో* పాల్గొన్న.  పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంధాల చైర్మన్ గోవర్ధన్ సాగర్. మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి. మాజీ జడ్పీటీసీ కేతేపల్లి రవి. మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు* . గారు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో నాయకులు  *వాల్మీకి నాయుడు.  రోశయ్య. తిరుపతి నాయక్. మాజీ సర్పంచ్ నాగేంద్రం. సురేష్ శెట్టి. సుల్తాన్. రవినాయక్* . జూపల్లి యువసేన నాయకులు. తదితరులు పాలుగోన్నారు.

Continue reading