పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రామస్థాయిలో సన్మానం




ఏఎస్ఎన్ 24న్యూస్ ఛానల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఝాడే అనిల్ కుమార్
17జూన్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం, కన్నెపల్లి గ్రామనికి చెందిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సందర్భంగా వారికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రామస్థాయి ప్రశంసా పత్రాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోర్లె పార్వతి విద్యార్థులను అభినందిస్తూ, విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోర్లె పార్వతి, ఉప సర్పంచ్ మోర్లె సమత, హెచ్‌ఎం పెద్దూరీ అనూష, పంచాయతీ కార్యదర్శి తొడుపునూరి సాయికృష్ణ, వార్డు సభ్యులు చెన్నూరి తిరుమలేష్, మోర్లె వనిత, యువ నాయకులు మోర్లె పాండురంగ్, మోర్లె రాజు, జునారి భీంరావ్, లెండుగూరె గణపతి, మందడే విజయ్, గ్రామ పెద్దలు మోర్లె పద్మ, మోర్లె నాగేష్, అలాగే ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి సన్మానించడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
WhatsApp Join Now
Youtube Subscribe