–

అంజలి తెలుగు న్యూస్ పత్రిక ప్రతినిధి నవీన్ గౌడ్ భిక్నూర్ జులై 13
కామారెడ్డి జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని, కామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు స్వయంగా ఆల్బెండజాల్ మాత్రలను అందించాడు. 19 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలందరికీ రెండుసార్లు ఆల్బెండజలు మాత్రలు ఇవ్వడం ద్వారా నులిపురుగుల సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపాడు. ఈ నులిపురుగుల కారణంగా పిల్లల్లో రక్తహీనత, శారీరక ఎదుగుదల, పోషకాహార లోపం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నాడు. జిల్లాలో 2,46,177 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించాడు. తల్లిదండ్రులు సైతం పిల్లలను మాత్రలు వేయించే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని కోరాడు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె వెంకటి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రోహిత్ కుమార్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ పర్వతాలు,మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఉమారాణి, స్థానిక కౌన్సిలర్ అఖిల,జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్,స్థానిక వైద్యాధికారి డాక్టర్ చందన ప్రియ, ఎంఈఓ ఎల్లయ్య, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు వై మాధవి.తదితర అధికారులు పాల్గొన్నారు.