జులై 3 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్న మున్సిపల్ కార్మికులు


   


అంజలి తెలుగు న్యూస్ పత్రిక ప్రతినిధి నవీన్ గౌడ్ భిక్నూర్ జూలై 01
డిమాండ్లపై స్పందించని అధికారులు
– సిబ్బంది కొరతతో పనిభారం పెరిగిందని కార్మికుల ఆవేదన
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు జులై 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే జూన్ 19న ఒకరోజు హెచ్చరిక సమ్మె నిర్వహించి మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేసినప్పటికీ, ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్చలు జరపకపోవడంతో పాటు సమస్యల పరిష్కారంపై స్పందించలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
సానిటేషన్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, జవాన్లు, కార్యాలయ సిబ్బంది తదితర విభాగాలకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. గతంలో విధుల నుంచి తొలగించిన 41 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 60 సంవత్సరాలు పూర్తైన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీలో తీవ్ర సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం అధికంగా పడుతోందని కార్మికులు తెలిపారు. వాటర్ వర్క్స్ విభాగంలో 148 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 90 మంది మాత్రమే పనిచేస్తున్నారని, శానిటేషన్ విభాగంలో 271 మంది అవసరముండగా కేవలం 230 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి వార్డులో నలుగురు కార్మికులు పనిచేయాల్సి ఉండగా ఇద్దరితోనే పనులు చేయిస్తున్నారని, చెత్త సేకరణ వాహనంపై ఇద్దరు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒక్కరితోనే పనులు నిర్వహింపజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు వెంటనే పరిష్కరించకపోతే జులై 3 నుంచి నిరవధిక సమ్మెను చేపడతామని, దీనికి పూర్తి బాధ్యత అధికారులదేనని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు హెచ్చరించారు.
అన్న గారు వీరితోపాటు
జిల్లా కలెక్టర్ గారికి మరియు లేబర్ ఆఫీసర్ గారికి మున్సిపల్ చైర్ పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్స్ కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది N. నర్సింగ్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కామారెడ్డి మున్సిపల్
WhatsApp Join Now
Youtube Subscribe