కామారెడ్డి జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర



అంజలి తెలుగు న్యూస్ పత్రిక ప్రతినిధి నవీన్ గౌడ్ భిక్నూర్ జూన్ 30

కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (జులై 1వ తేది నుండి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ.యం. రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్ గారు తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకాదని ఎస్పీ గారు హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపినారు.
అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
(పోలీస్ శాఖ)- కామారెడ్డి
WhatsApp Join Now
Youtube Subscribe