పోతుగల్ గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహణ

ఏఎస్ఎన్ 24 న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ నాయకులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన వారు ఆయన దేశ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన మహానేత అని స్మరించుకున్నారు. దళితులు, కార్మికులు మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు.సామాజిక న్యాయం, సమానత్వం, సోదరభావం వంటి విలువలను సమాజంలో నెలకొల్పేందుకు ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు. నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోల కృష్ణ, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe