
అంజలి నేటి సంకల్పం దినపత్రిక ప్రతినిధి నవీన్ గౌడ్ భిక్కనూరు మే 22
భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది,వివరాల్లోకి వెళ్లితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నందిగామకు చెందిన వీరబోయిన కార్తీక్ (25) సొంత పనులపై ఇస్సానగర్ వెళ్లి వస్తుండగా పెద్దమల్లారెడ్డి,ఇస్సన్నపల్లి మూలమలుపు దగ్గర ట్రాక్టర్, బైకు ఢీకొన్నట్లు తెలిపారు, ఈప్రమాదంలో కార్తీక్ తలకు గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు,ఈ సమాచారం అందుకున్న భిక్కనూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం కామరెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై డి. ఆంజనేయులు తెలిపారు,మృతునికి భార్య,కుమార్తి,కుమారుడు ఉన్నట్లు తెలిపారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe