ఎన్ హెచ్ 44  హైవేపై యాక్సిడెంట్.. ఇద్దరికీ తీవ్ర గాయాలు



అంజలి తెలుగు న్యూస్ పత్రిక ప్రతినిధి నవీన్ గౌడ్ భిక్నూర్ ఆగష్టు 02
మండలం కేంద్రంలోని బస్వాపూర్ శివారులోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో మహంకాళి బోనాల పండుగకు వచ్చిన శంకరవ్వ అనే మహిళ తిరుగు ప్రయాణంలో బస్టాండు వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు ఆమెను ఢీకొట్టినట్లు స్థానికులు తెలియజేశారు . పోలీసులు గాయపడిన ఇరువురిని అనంతరం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
WhatsApp Join Now
Youtube Subscribe