భిక్నూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ



భిక్నూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

అంజలి నేటి సంకల్పం దినపత్రిక ప్రతినిధి నవీన్ గౌడ్ భిక్నూర్ జూన్ 16

నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, గస్తీ మరింత పెండాలి

ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెంపొందేలా విధులు నిర్వర్తించాలి

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి :

జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు

కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ గారు మంగళవారం భిక్నూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమై రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరించి, వారు నిర్వహిస్తున్న విదులు, బాధ్యతలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన ఆర్ధిక నేరాలు, దొంగతనాలు, ఇతర కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ కేసులను ప్రాధాన్యతగా తీసుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.నేరాల నియంత్రణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు పగలు, రాత్రి గస్తీని పెంచాలని సూచించారు. తరచూ వాహనాల తనిఖీలు, నాకాబందీలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉండాలని ఆదేశించారు. స్టేషన్ పరిదిలో ఉన్న రౌడీపీటర్లు, కిడీలు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే ఫైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, రోడ్డు భద్రత అంశాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భిక్నూర్ ఎసహెదోవోకు సూచించారు. గ్రామాలు, కాలనీల్లో ప్రజలతో మమేకమవుతూ పోలీసులపై విశ్వాసం పెంపొందించేలా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ విది నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధత, వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను ఓపికగా విని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

PRO( పోలీస్ శాఖ- కామారెడ్డి)

WhatsApp Join Now
Youtube Subscribe